టిక్కెట్ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:49 AM
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దేవర సినిమా టిక్కెట్ల ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది...
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దేవర సినిమా టిక్కెట్ల ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అంతేకాదు మిడ్ నైట్ షోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిడ్ నైట్ షోలు ఆడించేందుకు 29 థియేటర్లకు అనుమతించింది. ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా రిలీజ్ రోజున ఆరు షోలు ఆడించేందుకు థియేటర్లకు అనుమతి ఇచ్చారు. మరుసటి రోజు నుంచి అక్టోబరు 6 వరకు రోజుకు 5 షోలు ఆడించుకునే వెసులు బాటు కల్పించారు. తొలిరోజు టిక్కెట్ ధరలను రూ. 100 పెంచుకునేందుకు అనుమతించారు. సింగిల్ స్ర్కీన్‌లలో టిక్కెట్‌పై రూ. 25, మల్లీప్లెక్స్‌లో రూ. 50 పెంచుకునే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సినిమాకు టికెట్ రేటు పెంచే సదుపాయం అక్కడి ప్రభుత్వం కల్పించిన సంగతి విదితమే.
అమెరికా వెళ్లిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతీతో కలసి అమెరికా బయలుదేరారు. లాస్‌ఏంజిల్స్‌లోని బియాండ్‌ఫెస్ట్‌లో ఈ నెల 26 సాయంత్రం జరిగే దేవర స్ర్కీనింగ్‌కి హాజరు కానున్నారు. అలాగే అక్కడ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు.