G2: ‘గూఢచారి’ 6వ యానివర్సరీ.. G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ విడుదల

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:06 PM

హీరో అడివి శేష్ నటించిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ 6వ యానివర్సరీని పురస్కరించుకుని.. ఫ్యాన్స్ కోసం ట్విట్టర్‌లో థ్రిల్లింగ్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘G2’. ఈ ఫ్రాంచైజీని న్యూ హైట్స్‌కు ఎలివేట్ చేసేలా స్టన్నింగ్ మూమెంట్స్ ఉన్నాయి.

Adivi Sesh in G2 Movie

హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ (Goodachari) 6వ యానివర్సరీని పురస్కరించుకుని.. ఫ్యాన్స్ కోసం ట్విట్టర్‌లో థ్రిల్లింగ్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘G2’. ఈ ఫ్రాంచైజీని న్యూ హైట్స్‌కు ఎలివేట్ చేసేలా స్టన్నింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ సినిమాని ఇంటర్నేషనల్ స్కేల్‌లో ప్రజెంట్ చేస్తూ ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను రిలీజ్ చేశారు. ‘G2’లోని ఈ మూమెంట్స్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకంగా నిలిచే స్పై థ్రిల్లర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. (Goodachari Sixth Anniversary)

Adivi-Sesh-3.jpg

2025 సెకండాఫ్‌లో గ్రాండ్‌గా విడుదల కానున్న ‘G2’ అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అవలబుల్‌గా ఉండనుంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి (Vinay Kumar Sirigineedi) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన శేష్‌తో కలిసి రైటర్‌గా కూడా ఉన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ.. గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. ‘G2’ బిగ్గర్ అండ్ ఇంటర్నేషనల్ స్కేల్‌లో వుంటుంది. ‘గూఢచారి’ సినిమాను అభిమానించిన వారందరికీ ‘G2’ ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుందని తెలిపారు.

Also Read- Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ


Sesh.jpg

దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం 40 శాతం షూటింగ్ పూర్తి చేశాం. సినిమా అద్భుతమైన క్యాలిటీతో వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న తీరుపై చాలా నమ్మకంగా, ఉత్సాహంగా వున్నాం. ఓ అత్యద్భుతమైన విజువల్ వండర్ క్రియేట్ చేయడంపై మేమంతా దృష్టి పెట్టాం. థ్రిల్లింగ్ సెట్ పీస్‌లు, డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్‌.. ఇలా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేలా చిత్రీకరణ జరుపుతున్నాం. యాక్షన్ డ్రామా జానర్‌లోని అభిమానులందరికీ ఈ చిత్రం గొప్ప అనుభూతిని ఇస్తుంది’’ అని అన్నారు.

Adivi-Sesh-G2.jpg

నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) మాట్లాడుతూ.. ‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక మైల్ స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రం 6వ యానివర్సరీ జరుపుకుంటున్నాము. ‘G2’ 40 శాతం షూటింగ్‌ అద్భుతంగా పూర్తి చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా అంచనాలకు మించి వుంటుందని చెప్పగలం. మొత్తం బడ్జెట్‌కు ఎంత ఖర్చవుతుందో అంత ఖర్చుతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌ని ఇటీవలే చిత్రీకరించాము. ఇది మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ అడ్వెంచర్’’ అని తెలపగా.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Producer Abhishek Agarwal) మాట్లాడుతూ.. ‘‘మా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ‘G2’ ఒకటి. ఇంటర్నేషనల్ స్కేల్ ప్రొడక్షన్ తీసుకురావడానికి శేష్, వినయ్, టీం చాలా కష్టపడుతున్నారు. సినిమా గ్రాండియర్‌గా వుంటుంది. ఇటివలే ఒక యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేశాం. ఈ ఒక్క సీక్వెన్స్‌కి అయిన బడ్జెట్.. మొత్తం ‘గూఢచారి’ బడ్జెట్ కంటే ఎక్కువ’’ అని పేర్కొన్నారు.

Adivi-Sesh.jpg

Read Latest Cinema News

Updated Date - Aug 03 , 2024 | 05:06 PM

G2 మూవీ ప్రీ విజన్ అనౌన్స్‌మెంట్

G2: ఆసక్తికరంగా అడివి శేష్ ఫస్ట్ లుక్

Adivi Sesh: 'గూఢచారి 2' లో కథానాయకురాలిని మార్చిన అడివి శేష్

Adivi Sesh: ‘గూఢచారి 2’ ను ప్రకటించిన హీరో.. ఆ రోజే లాంచ్..

Adivi Sesh: సైన్స్‌ అంటే ఎంత ఇష్టమో.. గణితం అంటే అంత భయం