Ram Charan: ఆంధ్ర‌, తెలంగాణ‌ల్లో ఉన్నామా! లేక డ‌ల్లాస్‌కు వ‌చ్చామా!

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:25 AM

డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో ‘గేమ్ చేంజ‌ర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం గ్రాండ్ లెవ‌ల్లో ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌తో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళనంలో రామ్ చ‌ర‌ణ్‌, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు ఏమన్నారంటే..

Global Star Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో ‘గేమ్ చేంజ‌ర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌తో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళనంలో రామ్ చ‌ర‌ణ్‌, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read-Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..

ఈ కార్యక్రమంలో గ్లోబల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ‘‘డల్లాస్‌లోని అభిమానుల‌కు ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ఇక్క‌డి వారు చూపించిన ప్రేమాభిమానాల‌తో మాట‌లు కూడా రావ‌టం లేదు. మమ్మ‌ల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఆంధ్ర‌, తెలంగాణ‌ల్లో ఉన్నామా! లేక డ‌ల్లాస్‌కు వ‌చ్చామా! అనేది కూడా అర్థం కావ‌టం లేదు. ల‌వ్ యు ఆల్‌. అంద‌రూ నాపై ప్రేమ‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు థాంక్స్‌. ఓవ‌ర్‌సీస్‌లోని ప్ర‌జ‌లే ముందుగా సినిమాను చూస్తారు. అందుకే ఇక్క‌డ నుంచే ప్ర‌మోష‌న్స్‌ను మొదలు పెడుతున్నాం. మా ‘గేమ్ చేంజ‌ర్‌’కు మీ అంద‌రి ఆశీస్సులు కావాలి. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్‌. ఇంత పెద్ద ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన రాజేష్ క‌ల్లెప‌ల్లి అండ్ టీమ్‌కు స్పెష‌ల్ థాంక్స్‌. జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోన్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.


Game-Changer.jpg

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ ‘గేమ్ చేంజ‌ర్‌’ అనే టైటిల్‌ను పెట్టిన‌ప్పుడే స‌రికొత్త‌గా ప్ర‌మోష‌న్స్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అందులో భాగంగా డ‌ల్లాస్‌ను సెల‌క్ట్ చేసుకున్నాం. యు.ఎస్‌లో ఇంత భారీగా ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌టం అనేది ఇదే తొలిసారి. టైటిల్‌కు త‌గ్గ‌ట్లే ఈవెంట్‌ను చేయాల‌ని చేశాం. దానికి రాజేష్‌, ముందుకొచ్చి స‌పోర్ట్ చేశారు. గ్లోబ‌ల్ స్టార్ గేమ్ ఛేంజ‌ర్ అన్‌ప్రిడెక్ట‌బుల్‌’’ అన్నారు.

ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు గేమ్ చేంజ‌ర్‌ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.


Dil-Raju.jpg

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2024 | 12:25 AM