Game Changer: ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే..
ABN , Publish Date - Sep 28 , 2024 | 08:53 PM
‘గేమ్ చేంజర్’ మూవీ కోసం మెగాభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారనేదానికి రోజూ ఈ టైటిల్ ట్రెండింగ్‌లో ఉండటమే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీమ్‌లో కదలిక వచ్చింది. ఈ సినిమా అప్డేట్స్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఇక వరుస ట్రీట్స్ ఇచ్చేందుకు యూనిట్ సిద్ధమైంది. అందులో భాగంగా తాజాగా సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమోని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో పాటు ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ధమ్ తు దికాజా..’ అంటూ అలరించనుంది. పూర్తి పాటను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. (Raa Macha Macha Song Promo)
Also Read- Mohan Babu and Vishnu: ఏపీ సీఎంను కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు.. విషయం ఏమిటంటే
‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమో విషయానికి వస్తే.. రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ను ఇండియన్ సినీ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్టర్ శంకర్ తన మార్క్‌ను చూపిస్తూ తెరకెక్కించారనేది ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఎనర్జిటిక్, స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ ఆకట్టుకుంటున్నారు. ఇక గ్రేస్‌తో ఆయన వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఈ స్టెప్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతుందనటంలో సందేహం లేదు. ఇందులో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు.. ఇందులో భాగమవటం విశేషం.
రామ్ చరణ్ ఈ పాటలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతులను బేస్ చేసుకుని ఈ పాటను శంకర్ వినూత్నంగా తెరకెక్కించారు. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు వంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రానప్ప, పైకా, దురువ వంటి వాటితో పాటు, కర్ణాటకు చెందిన హలారి, ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి నృత్య రీతులను కూడా భాగం చేశారు. గ్రాండియర్ లుక్, డిఫరెంట్ సౌండింగ్‌తో పాట ఎనర్జిటిక్‌గా ఉంది. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో ఈ పాట రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నకాష్ అజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు.