FNCC: వరద బాధితులకు ఎఫ్‌ఎన్‌సీసీ సాయం!
ABN , Publish Date - Sep 26 , 2024 | 05:43 PM
తాజాగా ఎఫ్‌ఎన్‌సీసీ (FNCC)తరఫున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ని కలిసి 25 లక్షల విరాళాన్ని అందజేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పిలుపు మేరకు ఎంతో మంది వరద బాధితుల సహాయార్ధం (CMRF) విరాళాలు అందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించడానికి సినిమా రంగం ముందు వరుసలో ఉంటుంది. చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు, దర్శకనిర్మాతలు తమవంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. తాజాగా ఎఫ్‌ఎన్‌సీసీ (FNCC)తరఫున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ని కలిసి 25 లక్షల విరాళాన్ని అందజేశారు. ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి,, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు చెక్కును అందజేశారు.
ఆది శేషగిరిరావు మాట్లాడుతూ "ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారి ఎఫ్‌ఎన్‌సిసి క్లబ్ సహాయ కార్యక్రమాలలో ముందుంటుంది’’ అని అన్నారు.
మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ "ఎఫ్‌ఎన్‌సీసీ తరఫున ఏపీ ముఖ్యమంత్రికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అని అన్నారు.