ఏఐ జనరేటెడ్‌ తొలి లిరికల్‌ వీడియో

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:59 AM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ మార్చి ఒకటిన విడుదల కానుంది. పురుషోత్తమ్‌ రాజ్‌ దర్శకత్వంలో స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు...

ఏఐ జనరేటెడ్‌ తొలి లిరికల్‌ వీడియో

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ మార్చి ఒకటిన విడుదల కానుంది. పురుషోత్తమ్‌ రాజ్‌ దర్శకత్వంలో స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు. డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్‌ ట్రాన్స్‌’ పాటను సంగీత దర్శకుడు కీరవాణి విడుదల చేశారు. చైతన్యప్రసాద్‌ రాసిన ఈ పాటకు శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు అందించారు. ఏఐ చాట్‌ జీపీటీని ఉపయోగించి లిరికల్‌ విజువల్స్‌ తయారు చేశారు. ఈ లాంచింగ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరైన హీరో సుహాస్‌ మాట్లాడుతూ ‘శివ చాలా మంచోడు. ఈ సినిమా ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. చైతన్యప్రసాద్‌ రాసిన పాటలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయి. శ్రీ చరణ్‌ మంచి సంగీతం ఇచ్చారు’ అని ప్రశంసించారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ ‘సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో ఈ పాట వస్తుంది. నా పేవరెట్‌ సాంగ్‌ ఇది’ అన్నారు. ‘మార్చి ఒకటిన సినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా థియేటర్‌లో చూడండి. అందరికీ అద్భుతంగా నచ్చుతుంది’ అన్నారు నిర్మాతలు.

Updated Date - Feb 19 , 2024 | 02:59 AM