ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు..

ABN , Publish Date - Nov 19 , 2024 | 06:19 AM

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఽఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఽఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఈ సినిమాలో చూపించారు. ‘ఎమర్జెన్సీ’ సినిమా ప్రారంభించినప్పటి నుంచి కంగనాకు చిక్కులు మొదలయ్యాయి. చంపేస్తామని హెచ్చరికలూ వచ్చాయి. అన్నీ తట్టుకుని సినిమా పూర్తి చేసి, సెన్సారుకు వెళితే, అక్కడ కూడా అభ్యంతరాలు వెల్లడయ్యాయి. చివరకు సెన్సార్‌ బోర్డ్‌ సూచనలకు చిత్ర నిర్మాణ సంస్థ అంగీకరించడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ‘భారతదేశంలో శక్తిమంతమైన మహిళ కథ, దేశ విధిని మార్చిన క్షణాలు మీ ముందుకు రానున్నాయి’ అని పేర్కొంటూ వచ్చే ఏడాది జనవరి 17న ‘ఎమర్జెన్సీ’ విడుదలవుతుందని వెల్లడించారు కంగన.

Updated Date - Nov 19 , 2024 | 06:19 AM