విషయమున్న సినిమాలను ఆదరిస్తారు

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:36 AM

రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో సాయిరోనక్‌, ప్రగ్యా జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం...

రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో సాయిరోనక్‌, ప్రగ్యా జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘విషయం ఉన్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అందుకు ‘లగ్గం’ సినిమా విజయమే రుజువు అని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ జీవితాలు, ఓ తండ్రి తన కూతురి కోసం పడే తపన, కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలతో దర్శకుడు ఫుల్‌ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చారు’ అని అన్నారు. హీరో సాయి రోనక్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నటించడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది, బయట వస్తున్న టాక్‌ని బట్టి చూస్తే ఈ సినిమా తరవాత నాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి అనే నమ్మకం ఏర్పడింది’ అని తెలిపారు

Updated Date - Oct 30 , 2024 | 05:36 AM