శివరాత్రి పాట చిత్రీకరణలో
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:09 AM
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున ్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ...
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున ్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. భారీ సెట్ వేసి అందులో నాగచైతన్య సాయిపల్లవిపై శివరాత్రి నేపథ్యంలో సాగే గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా పాట చిత్రీకరణకు సంబంధించిన రెండు పోస్టర్స్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. శివ పార్వతులను తలపించేలా నర్తిస్తున్న నాగచైతన్య, సాయిపల్లవి జంట ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. సినిమాటోగ్రఫీ: షామ్‌దత్.