Happy Fathers Day: సెలబ్రిటీలు.. ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు!

ABN , Publish Date - Jun 16 , 2024 | 01:02 PM

ఫాదర్స్‌ డేని (Fathers Day) పురస్కరించుకుని సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Happy Fathers Day: సెలబ్రిటీలు.. ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు!

ఫాదర్స్‌ డేని (Fathers Day) పురస్కరించుకుని సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబు , అల్లు అర్జున్(Allu arjun), నభా నటేష్‌, సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ ఫొటోలు పంచుకున్నారు. ‘ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో’ అంటూ గతంలో తన తండ్రితో కలిసి దిగిన స్టిల్‌ను చిరంజీవి షేర్‌ చేశారు. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అంటూ తన తండ్రితో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు అల్లు అర్జున్.

allu.jfif

‘‘సన్నిహితులారా.. తండ్రిని దైవంగా భావించిన వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హ్యాపీ ఫాదర్స్‌ డే’’  అని మంచు మోహన్‌ బాబు పోస్ట్‌ చేశారు.

తన తండ్రి నాగార్జునతో కలిసి బాల్యంలో దిగిన ఫొటోను నాగచైతన్య షేర్‌ చేశారు. ‘ది ఓజీ’ అని క్యాప్షన్‌ పెట్టారు


'నా తండ్రి ప్రపంచంలోనే బెస్ట్‌ ఫాదర్‌ అని నభా నటేష్‌ అన్నారు. ఈ పోస్ట్‌లపై స్పందించిన ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated Date - Jun 16 , 2024 | 02:04 PM