తండ్రి దర్శకుడు.. తనయుడు హీరో
ABN , Publish Date - Feb 19 , 2024 | 02:52 AM
తన తనయుడు హేమచంద్రారెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కుల్లపరెడ్డి సురేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో ‘ఇద్దరికీ కొత్తేగా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది...
తన తనయుడు హేమచంద్రారెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కుల్లపరెడ్డి సురేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో ‘ఇద్దరికీ కొత్తేగా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘ఇంతకుముందు నేను ‘వకాలత్ నామా’ అనే చిత్రంలో హీరోగా నటించాను. ఇప్పుడు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ‘ఇద్దరికీ కొత్తేగా’ చిత్రాన్ని నా దర్శకత్వంలో నిర్మిస్తున్నాను. నా లైఫ్‌స్టోరీనే ఇతివృత్తంగా ఎన్నుకున్నాను. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: కోట తిరుపతిరెడ్డి, మాటలు: కరుణాకర్, కె.కె.రెడ్డి, సంగీతం: ఎం.ఎం.ఎస్.