అందరికీ నచ్చుతుంది
ABN , Publish Date - Dec 18 , 2024 | 02:23 AM
పవన్ సుంకర దర్శకత్వంలో షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘లీలా వినోదం’. అనగ అజిత్ హీరోయిన్. శ్రీధర్ మారిసా నిర్మించారు. ఈనెల 19 నుంచి ఈటీవీ విన్‌లో...
పవన్ సుంకర దర్శకత్వంలో షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘లీలా వినోదం’. అనగ అజిత్ హీరోయిన్. శ్రీధర్ మారిసా నిర్మించారు. ఈనెల 19 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ ‘నాకు సరైన సమయంలో ‘లీలా వినోదం’ వచ్చింది. ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు పవన్ మాట్లాడుతూ ‘ఈ మూవీలో ఓవర్ థింకింగ్ అనే కాన్సె్‌ప్టని చూపిస్తున్నాం. దీనికి అందరూ రిలేట్ అవుతారు’ అన్నారు.