ఎనభై రెండేళ్ల వయసులోనూ.. అదే ఉత్సాహం!

ABN , Publish Date - Oct 23 , 2024 | 02:06 AM

హాలీవుడ్‌ నటుడు హారిసన్‌ ఫోర్డ్‌ పేరు వినగానే ఆయన నటించిన ‘స్టార్‌ వార్స్‌’, ‘ఇండియానా జోన్స్‌’ వంటి చిత్రాలు వెంటనే గుర్తుకు వస్తాయి. ఈ ఎనభై రెండేళ్ల నట శిఖరంకు...

హాలీవుడ్‌ నటుడు హారిసన్‌ ఫోర్డ్‌ పేరు వినగానే ఆయన నటించిన ‘స్టార్‌ వార్స్‌’, ‘ఇండియానా జోన్స్‌’ వంటి చిత్రాలు వెంటనే గుర్తుకు వస్తాయి. ఈ ఎనభై రెండేళ్ల నట శిఖరంకు ఇప్పటికీ నటన అంటే ఎంతో ఇష్టం. చిత్ర పరిశ్రమలోకి నూతన దర్శకులు వస్తున్నారు, కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. అటువంటి వాళ్లతో పని చేయడం నాకు ఎప్పుడూ ఆనందమే. ఓ హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హారిసన్‌ మాట్లాడుతూ ‘నాకు హాస్యం అంటే ఇష్టం. జోక్స్‌ వెయ్యడం, ఎంజాయ్‌ చేయడం చేస్తుంటాను. కామెడీతో కూడిన ఎమోషనల్‌ డ్రామా కథలను ఎక్కువగా ఇష్టపడతాను. వాటినే ఎన్నుకుంటాను’ అని చెప్పారు. ఈ నెల 16న ప్రారంభమైన కామెడీ సిరీస్‌ ‘ష్రింకింగ్‌’ సీజన్‌ 2లో హారిసన్‌ ఫోర్డ్‌ నటిస్తున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 02:06 AM