వినోదం ప్లస్‌ సందేశం

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:01 AM

సాయిరోనక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్ర పోషించారు. రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం విడుదల...

సాయిరోనక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్ర పోషించారు. రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. హీరో సుధీర్‌బాబు ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. పెళ్లి నేపథ్యంలో వినోదంతో పాటు చక్కని సందేశంతో తెరకెక్కిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు. సంగీతం: మణిశర్మ, చరణ్‌ అర్జున్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి

Updated Date - Oct 01 , 2024 | 04:01 AM