గోవాలో ఇఫీ ప్రారంభం

ABN , Publish Date - Nov 21 , 2024 | 06:25 AM

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలో డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా చిత్రం

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలో డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా చిత్రం ‘బెటర్‌ మాన్‌’ ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ పాల్గొన్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి అక్కినేని నాగార్జున, అమల దంపతులు హాజరయ్యారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాన్యా మల్హోత్రా, మానుషీ చిల్లర్‌ రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. 81 దేశాల నుంచి ఎంపిక చేసిన 180 సినిమాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. తెలుగు నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘35 చిన్న కథకాదు’ చిత్రాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అలాగే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన నటించిన కొన్ని చిత్రాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం కొనసాగుతుంది.

Updated Date - Nov 21 , 2024 | 06:25 AM