Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ పూర్తి.. ఇక దూకుడే!

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:07 PM

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్ట్‌ 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లుగా అప్‌డేట్ వదిలారు.

Double Ismart Movie Still

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని (Ram Pothineni), డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh) బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) ఆగస్ట్‌ 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లుగా అప్‌డేట్ వదిలారు. దీంతో మరోసారి ఈ చిత్ర పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Double Ismart Shoot Completed)

Also Read-Shyamala Devi: అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ప్రభాస్‌తో సినిమా చేయిస్తా..


Ram.jpg

మరో వైపు మేకర్స్ మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ స్టెప్పా మార్‌తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఇది ఆడియో ప్రమోషన్‌లకు చార్ట్‌బస్టర్ స్టార్ట్, మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేయడం ద్వారా పబ్లిసిటీ దూకుడు పెంచారు. ‘డబుల్ ఇస్మార్ట్’ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌, మచ్ ఎవైటెడ్ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్యామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రాఫర్స్ కాగా.. మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. (Double Ismart Update)

Read Latest Cinema News

Updated Date - Jul 05 , 2024 | 10:07 PM