చిందెయ్యరా ఘోర హర
ABN , Publish Date - Jan 03 , 2024 | 01:20 AM
ధనుష్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. కన్నడ అగ్రహీరో శివరాజ్‌కుమార్ ఇందులో కీలక పాత్ర...

ధనుష్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. కన్నడ అగ్రహీరో శివరాజ్‌కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మూడో పాటను చిత్రబృందం విడుదల చేశారు. ‘ఘోర హర..’ అంటూ సాగే పాటను రాకేందుమౌళి రాయగా, జీవి ప్రకాశ్‌కుమార్ స్వరాలందించారు. రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో ఆలపించారు. ఈ పాటను ధనుషు, శివరాజ్‌కుమార్‌లపై చిత్రీకరించడం విశేషం. ఈ పాట ఈసినిమాకే హైలెట్‌గా నిలువనుందని, ధనుష్, శివరాజ్‌కుమార్ డాన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు. 1930-40 మధ్య జరిగే పిరియడ్ కథాంశంతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. సందీ్‌పకిషన్ ప్రత్యేపాత్ర పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని.