మంచి కంటెంట్‌తో రేవు
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:20 AM
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డాక్టర్ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా...
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డాక్టర్ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విజువల్స్ బాగున్నాయి. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘ఇదొక విభిన్న తరహా సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని దర్శకుడు హరినాథ్ పులి చెప్పారు. ఈ సినిమాకు ఎడిటర్: శివ శర్వాని, డీఓపీ: రేవంత్ సాగర్, నిర్మాణ పర్యవేక్షణ: సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పర్వతనేని రామ్‌బాబు.