అమ్మాయిలకు ఆమడ దూరం
ABN , Publish Date - Aug 20 , 2024 | 02:34 AM
రాజ్‌తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. అమ్మాయిలంటే ఆమడదూరంలో ఉండే హీరో పాత్రను హిలేరియ్‌సగా పరిచయం...
రాజ్‌తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. అమ్మాయిలంటే ఆమడదూరంలో ఉండే హీరో పాత్రను హిలేరియ్‌సగా పరిచయం చేసింది ఈ ట్రైలర్. అలాగే టీవీ గణేశ్, హైపర్ ఆది, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు కూడా వినోదభరితంగా ఉంటాయని దర్శకుడు జె.శివసాయి చెప్పారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 7న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఎన్వీ కుమార్ చెప్పారు.