‘లాపతా లేడీ్‌స’కు నిరాశే!

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:15 AM

భారతీయ చిత్రం ‘లాపతా లేడీ్‌స’కు ఆస్కార్‌ అవార్డుల రేసులో నిరాశ ఎదురైంది. ఆమిర్‌ఖాన్‌ సతీమణి, ‘దోభీ ఘాట్‌’ ఫేమ్‌ కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డు కోసం ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో...

  • ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో దక్కని చోటు

భారతీయ చిత్రం ‘లాపతా లేడీ్‌స’కు ఆస్కార్‌ అవార్డుల రేసులో నిరాశ ఎదురైంది. ఆమిర్‌ఖాన్‌ సతీమణి, ‘దోభీ ఘాట్‌’ ఫేమ్‌ కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డు కోసం ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన విషయం విదితమే. ‘లాపతా లేడీస్‌’ గొప్ప సందేశాత్మక చిత్రం కనుక తప్పకుండా ఆస్కార్‌ అవార్డ్‌ వస్తుందని అందరూ భావించారు. అయితే మంగళవారం ప్రకటించిన ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో ‘లాపతా లేడీస్‌’ లేకపోవడం అందరినీ నిరాశపరిచింది. అయుతే భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో సంజయ్‌ సూరి తెరకెక్కించిన ‘సంతోష్‌’ అనే హిందీ చిత్రం మాత్రం యూకే నుంచి ఎన్నికై ఈ షార్ట్‌ లిస్ట్‌లో ఉండడం కొంతలో కొంత ఊరట. 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే, రెండు సార్లు అకాడమీ అవార్డు అందుకున్న భారతీయ నిర్మాత గునీత్‌ మోంగా


ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘అనుజ’. న్యూ ఢిల్లీ నేపథ్యంలో 9 ఏళ్ల బాలకార్మికురాలు జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కింది. లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ కేటగిరి జాబితాలో ఎంపికైన 15 లఘు చిత్రాల్లో ‘అనుజ’ ఒకటి కావడం విశేషం. వచ్చే ఏడాది జనవరి 17న ఫైనల్‌ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. మార్చి 3న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.

Updated Date - Dec 19 , 2024 | 06:16 AM