Naari: స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలి.. చెబుతుంది ‘నారి’.. ఎప్పుడంటే
ABN , Publish Date - Dec 23 , 2024 | 10:59 PM
మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి? వారికి ఎలా సపోర్ట్ చేయాలి? అనే అంశాలను ‘నారి’ సినిమా తెలియజేస్తుందని అన్నారు దర్శకుడు సూర్య వంటిపల్లి. ‘నారి’ విడుదల తేదీని చెబుతూ.. చిత్ర విశేషాలను ఆయన షేర్ చేసుకున్నారు.
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘నారి’. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాలలో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించిన ఈ సినిమా 2025, జనవరి 24వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫ్యామిలీ డ్రామా కథతో ఈ ‘నారి’ సినిమాను రూపొందించాము. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం. మా సినిమాలో ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ తమ వాయిస్ అందించారు. మహిళా సాధికారత మీద రూపకల్పన చేసిన పాటను ప్రముఖ సింగర్ చిన్మయి అద్భుతంగా పాడారు. సింగర్ సునీత మరో అద్భుతమైన పాట పాడారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న సీషోర్ అనే యువకుడు ఒక మంచి పాట పాడారు. చిత్ర ఆడియోను దివో కంపెనీ ద్వారా త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి? వారికి ఎలా సపోర్ట్ చేయాలి? అనే అంశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.