Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:19 PM

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకొని సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లోనే ఇంత ధైర్యంగా కథ చెప్పానంటే సినిమా లోపల ఎంత వుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నానంటూ దర్శకుడు సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!
Saindhav Trailer Launch Event

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’ (Saindhav). ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకొని సంక్రాంతి (Sankranthi) స్పెషల్‌గా జనవరి 13న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో మరింత దూకుడు పెంచింది. బుధవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారని డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘వెంకటేష్‌గారి 75వ చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. ట్రైలర్‌లో కథ చెప్పేశాను. ఇంత ధైర్యంగా కథ చెప్పానంటే సినిమా లోపల ఎంత వుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నాను. వెంకీ‌గారు నాలుగు అడుగులు వేస్తేనే ఆడియన్స్ అరుస్తున్నారు. థియేటర్‌లో ఇంకేం చేస్తారో అని భయం వేస్తుంది(నవ్వుతూ). వెంకటేష్‌గారు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చారు. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా వాడేశాను. (Sailesh Kolanu About Saindhav)


Venki.jpg

హాలీవుడ్‌లో ‘ఈక్వైలైజర్, టేకెన్’ లాంటి సినిమాలు చూస్తున్నపుడు మన తెలుగులో కూడా ఆ ఏజ్ గ్రూప్ హీరోలు ఆ తరహా సినిమాలు చేస్తే యంగర్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కదా అనిపించేది. అలాంటి సమయంలో వెంకీ గారు పిలిచి ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. తప్పకుండా అందరూ సినిమా చూడండి. వెంకీ 75వ చిత్రాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్‌గారికి ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ థాంక్స్. వెంకీ మామ సినిమా అంటేనే పండగ. ఈ పండక్కి అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు వెంకీమామ సైంధవ్‌గా వస్తున్నాడు. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని కోరారు.


ఇవి కూడా చదవండి:

====================

*Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?

*******************************

*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

****************************

*Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

*****************************

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

**************************

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

Updated Date - Jan 03 , 2024 | 10:19 PM