‘ది 100’ని కృష్ణవంశీకి అంకితం చేస్తున్నా: యంగ్ డైరెక్టర్
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:24 AM
తన మొదటి సినిమా ‘ది 100’ చిత్రాన్ని తన గురువు కృష్ణవంశీకి అంకితమిచ్చారు యంగ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్. సోషల్ మీడియా వేదికగా తన గురు భక్తిని చాటుకున్న అతను.. కృష్ణవంశీగారికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
‘ది 100’ చిత్రాన్ని తన గురువు కృష్ణవంశీకి అంకితం చేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు యంగ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ది 100’ చిత్రం ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీకి అంకితమిస్తున్నట్లుగా చిత్ర దర్శకుడు ప్రకటించడంతో ‘ది 100’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్‌లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌ను అభినందించిన విషయం తెలిసిందే. పోలీస్ శాఖ ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో నిజాయితీగా ప్రదర్శించారని ఆయన కొనియాడారు. అలాంటి శశిధర్ మరోసారి తన చిత్రాన్ని తన గురువుకు అంకిత మిచ్చి.. గురువు పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్‌లో.. ‘‘నా స్టోరీ టెల్లింగ్ క్రాఫ్ట్ వెనుక డ్రైవింగ్ ఫోర్స్ మరియు నాకు స్ఫూర్తి నిచ్చిన వ్యక్తి కృష్ణ వంశీ. ఒక అర్థవంతమైన కథతో, పాత్రలతో సినిమా చేయడం వెనుక నా గురువు కృష్ణవంశీగారే ఉన్నారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, స్టోరీ చెప్పే విధానం.. నాకు ఈరోజు మొదటి చిత్రానికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డలు రావడానికి కారణమైందని గర్వంగా చెప్పగలను. అందుకే ఈ సినిమా సక్సెస్‌ను నా గురువు కృష్ణవంశీగారికి హృదయపూర్వకంగా అంకితమిస్తున్నాను. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు, సపోర్ట్ కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
పక్కనోడు చేసిన వర్క్ కూడా నేనే చేశానని చెప్పుకునే ఈ రోజుల్లో.. తన సినిమాకు అన్ని అవార్డులు రావడానికి కారణం కృష్ణవంశీనే అంటూ గురువు పట్ల వినయత, విధేయత చూపించిన చిత్ర దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి దర్శకుడు కచ్చితంగా సక్సెస్ అవుతారనే నానుడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. కచ్చితంగా ఈ దర్శకుడి నుండి టాలీవుడ్‌కు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఫ్యూచర్‌లో వస్తాయని ఊహించుకోవచ్చు.