Dhoom Dham: ‘ధూం ధాం’ నుంచి లవ్లీ మెలోడీ వదిలారు..

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:19 PM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ వదిలారు.

Dhoom Dham: ‘ధూం ధాం’ నుంచి లవ్లీ మెలోడీ వదిలారు..
Dhoom Dham Movie Poster

చేతన్ కృష్ణ (Chetan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dham). సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయి కిషోర్ మచ్చా (Sai Kishore Macha) దర్శకుడు. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ వదిలారు.

Also Read-Chiranjeevi: ఆ వెబ్ సిరీస్ చూసిన చిరు.. రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్!


‘ధూం ధాం’ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’ సాంగ్ ఛాట్ బస్టర్ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్ అవగా.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘మాయా సుందరి..’ (Maya Sundari) మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ మంచి బీట్‌తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు.


Dhoom-Dham.jpg

‘మాయా సుందరి.. హే మాయా సుందరి.. నా మాయా సుందరి.. ఎక్కడున్నావో మరి.. గుప్పెడు గుండెను నువ్వే పట్టుకుపోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..’ అంటూ సాగుతుందీ పాట. హీరో పాడుకునే లవ్ సాంగ్‌గా వచ్చిన ఈ లవ్లీ మెలోడీని పాటను స్టైలిష్‌గా రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట కూడా మొదటి పాట మాదిరిగానే మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Maya Sundari Song From Dhoom Dham)

Read Latest Cinema News

Updated Date - Jun 20 , 2024 | 05:19 PM