Dhanush: ధనుష్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, మరీ అంత ఎగతాళా...

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:30 AM

నేరుగా తెలుగు సినిమాలు చేస్తూ, తన తమిళ సినిమాలని తెలుగులో విడుదల చేస్తూ వున్న నటుడు ధనుష్, తన 'రాయం' సినిమా తెలుగు ప్రచారాలకు వచ్చేసరికి మాత్రం కేవలం తమిళంలోనే మాట్లాడుతాను అని మాట్లాడేడు. ఆ ఈవెంట్ కి వచ్చిన ఎవరికీ ధనుష్ ఏమి మాట్లాడేడు అనేది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. కనీసం ఆంగ్లంలో మాట్లాడటమో, లేదా తమిళంలో మాట్లాడిన దానికి వేరేవాళ్లతో చెప్పించడమో చేస్తే బాగుండేది అని ఒక చర్చ నడుస్తోంది. తెలుగు వాళ్ళు అంటే మరీ అంత లోకువ అయిపోయారా అని కూడా పరిశ్రమలో అంటున్నారు...

Dhanush at Raayal film pre-release event

'రాయన్' సినిమా తమిళ నటుడు ధనుష్ కి 50వ సినిమా. ఈ సినిమాకి దర్శకుడు కూడా ధనుష్ చేశాడు. ఈ సినిమాలో ధనుష్ తో పాటు, ఎస్.జె. సూర్య, కాళిదాస్ జయరాం, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. సన్ పిక్టర్స్ నిర్మిస్తున్నారు, కళానిధి మారన్ నిర్మాత. సన్ పిక్చర్స్ తో వున్న అనుబంధంతో తెలుగులో ఈ సినిమాని ఆసియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో ఒక హోటల్ లో జరిగింది. ఈ వేడుకకి ఈ సినిమా నటీనటులు హాజరయ్యారు, ప్రకాష్ రాజ్ కి తెలుగు వచ్చు, కాబట్టి అతను తెలుగులో మాట్లాడేడు, మధ్యలో ఆంగ్లంలో కూడా మాట్లాడేడు. కానీ ధనుష్ కి వచ్చేసరికి అతను మాత్రం పూర్తిగా తమిళంలోనే మాట్లాడేడు. ముందుగానే చెప్పాడు తెలుగు రాదు అని అందుకని మొత్తం తమిళం లో మాట్లాడేడు. కానీ తెలుగులో సినిమా ప్రచారాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకులు వున్న సభలో తమిళంలో మాట్లాడితే ఎవరికీ అర్థం అవుతుంది?

ప్రేక్షకులు మధ్య మధ్యలో ధనుష్ ఏవో తెలుగు నటుల పేర్లు చెపుతుంటే చప్పట్లు కొడుతున్నారు, అంతే కానీ ధనుష్ దేని గురించి మాట్లాడేడు, ఏమి మాట్లాడేడు అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. మరి తెలుగు ఈవెంట్ చేస్తూ కనీసం వచ్చీ రాని తెలుగులో మాట్లాడినా అర్థం అవుతుంది, లేదా ఆంగ్లంలో మాట్లాడినా అర్థం అవుతుంది. ఈ రెండూ కాకుండా కేవలం తమిళంలో మాట్లాడితే ఆ ఈవెంట్ కి అటెండ్ అయిన ఒక్కరికి కూడా ధనుష్ ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాక బిక్క మొహాలు వేసుకున్నారు. తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవ్వాలి, ఇక్కడ బాగా ఆడాలి, తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేసెయ్యాలి, కానీ తెలుగు ప్రేక్షకులకి మాత్రం అర్థం కాని భాషలో మాత్రం ప్రచారాల్లో మాట్లాడాలి. ఇది అతని తప్పు కాదు, తెలుగు నిర్మాతలు, దర్శకులది అని పరిశ్రమలో అంటున్నారు.

dhanushspeechintamil.jpg

ఎందుకంటే తెలుగులో నటులు లేనట్టుగా తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈమధ్య తమిళ, మలయాళం నటుల వెంట సినిమాల కోసం పరుగులు తీస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ పారితోషికాలు ఇచ్చి, కేవలం కాంబినేషన్ కోసం కొంతమంది నిర్మాతలు ఇలా తమిళ, మలయాళం నటుల్ని ఇక్కడ పెద్దవాళ్ళని చేస్తున్నారు, అందుకే ఆ నటులు కూడా తెలుగు వాళ్ళని చాలా చీప్ గా చూస్తున్నారు అని ఒక నిర్మాత అన్నారు.

"ఇప్పుడు ప్రతి వాళ్ళు వార్తల్లో ఉండాలి అనుకుంటున్నారు, అదే ప్రచారం అనుకుంటున్నారు. అందుకని కొంతమంది కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. అలా అయినా ప్రచారం వస్తుందని, ధనుష్ తమిళం మాట్లాడటం కూడా అందులో భాగమే,' అని ఇంకొక నిర్మాత అన్నారు. ఏమైనా కూడా ఈమధ్య తెలుగు నిర్మాతలు, దర్శకులు, ప్రేక్షకులు, మీడియా అన్నా పరభాషా నటులకి బాగా లోకువ అయిపొయింది. ఇదే విధంగా తమిళ నాడులో వాళ్ళు ప్రవర్తిస్తే అక్కడ ప్రేక్షకులు, మీడియా ఊరుకోరు అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు, అందుకే అక్కడ మామూలుగా వుంటారు అని ఇంకొక నిర్మాత చెప్పారు.

Updated Date - Jul 23 , 2024 | 12:16 PM