Hitler: ‘దేవర’కు పోటీగా వస్తోన్న చిత్ర ట్రైలర్ విడుదలైంది..

ABN , Publish Date - Sep 19 , 2024 | 08:29 PM

సెప్టెంబర్ 27వ తేదీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో తెలిసిందే. ఆ రోజు ఎప్పటి నుంచో వేచి చూస్తోన్న ‘దేవర’ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ‘దేవర’కు పోటీగా మరో సినిమా కూడా దిగుతోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

Hitler vs Devara

సెప్టెంబర్ 27వ తేదీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో తెలిసిందే. ఆ రోజు ఎప్పటి నుంచో వేచి చూస్తోన్న ‘దేవర’ (Devara) సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ‘దేవర’కు పోటీగా మరో సినిమా కూడా దిగుతోంది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) తన కొత్త సినిమా ‘హిట్లర్’తో సెప్టెంబర్ 27న సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా ఈ ‘హిట్లర్’ (Hitler) సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ‘హిట్లర్’ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Also Read- NagaBabu: నాగబాబు కొటేషన్స్‌.. కొరియోగ్రాఫర్‌ కోసమేనా


Devara.jpg

ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్‌లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్‌లో రివీల్ చేశారు. దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ‘హిట్లర్’ ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పెర్ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్‌తో వచ్చిన ఈ ట్రైలర్‌‌ సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. అలాగే విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ‘హిట్లర్’ మరో వైవిధ్యమైన చిత్రం అవుతుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మరి ‘దేవర’కి పోటీగా వస్తున్న ఈ ‘హిట్లర్’ ఎలాంటి రిజల్ట్‌ని ప్రేక్షకుల నుంచి రాబట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే..

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 19 , 2024 | 08:29 PM