Bharateeyudu 2: ఇరవై నిముషాలు ట్రిమ్ చేసినా చూడని జనాలు
ABN , Publish Date - Jul 16 , 2024 | 02:36 PM
కమల్ హాసన్, సిద్ధార్థ్, బాబీ సింహ నటించిన, శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'భారతీయుడు 2' జులై 12న విడుదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు నుండే కలెక్షన్స్ పెద్దగా లేని ఈ సినిమాని 20 నిముషాలపాటు నిడివి తగ్గించారు. అయినా కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది.
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు 2' మొదటి రోజు మొదటి షో నుండే నెగటివ్ టాక్ బయలుదేరింది. అవినీతి, లంచం నేపధ్యంగా వచ్చిన ఈ సినిమా నిడివి మూడు గంటలు వుంది. అయితే మొదటి రోజు తరువాత ప్రేక్షకులు ఈ చిత్ర నిడివి మరీ ఎక్కువగా ఉందని, ఇందులో చాలా సన్నివేశాలు డ్రాగ్ చేశారని విమర్శలు రావటంతో ఈ సినిమా 20 నిముషాల పాటు నిడివి తగ్గించినట్టుగా తెలిసింది. (Despite Bharateeyudu 2 trimmed by 20 minutes, the film didn't do well at the box office)
అయినా కూడా సినిమాలో విషయం లేనప్పుడు ఎన్ని నిముషాలు తగ్గించినా ఆ ప్రభావం మాత్రం సినిమా కలెక్షన్స్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, జాకిర్ హుస్సేన్, బాబీ సింహా ఇలా చాలామంది నటీనటులు వున్నారు. (Bharateeyudu 2 flop is a big jolt to Lyca productions as this is one of the high budget film, says a source)
28 ఏళ్ల క్రితం తీసిన 'భారతీయుడు' సినిమాకి సీక్వల్ గా వచ్చిన ఈ 'భారతీయుడు 2' కథా నేపధ్యం కూడా లంచం, అవినీతిల పైనే కథానాయకుడి పోరాటం. అయితే అది చెప్పే విధానంలో దర్శకుడు శంకర్ పూర్తిగా విఫలం అయ్యారు అని విమర్శకుల అభిప్రాయం. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లో కూడా ఘోరంగా విఫలం అయింది అని అంటున్నారు. ఈ సినిమాలో కొత్తదనం లేదని, భావోద్వేగాలు కరువయ్యాయని, భారతీయుడు మళ్ళీ రావాల్సిన సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని శంకర్ బలంగా చెప్పలేకపోయారని అంటున్నారు. (Kamal Haasan and Shankar combination film Bharateeyudu 2 is declared a flop in all languages, says trade pandits)
ఏమైనా ఒకప్పటి దర్శకుడు శంకర్ కి, ఇప్పటి శంకర్ కి తేడా కొట్టొచ్చినట్టు కనపడుతోంది అని కొందరంటున్నారు. శంకర్ తన మ్యాజిక్ టచ్ పోగొట్టుకున్నారా అని కూడా అంటున్నారు. ఈ సినిమాని లైకా సంస్థ చాలా పెద్ద బడ్జెట్ లో తీసింది. ఈ సినిమాకి ఇంకో సీక్వల్ 'భారతీయుడు 3' కూడా వస్తోంది, అది వచ్చే సంవత్సరం విడుదలవుతుంది.