ఏడ్చుకుంటూ ఇంటికి...

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:09 AM

వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘‘నటిగా నాకు మొదట్లో అవకాశాలు...

వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘‘నటిగా నాకు మొదట్లో అవకాశాలు అంత సులువుగా వచ్చేవి కావు. ఆడిషన్లకు హాజరు కావడం.. అందులో సెలక్ట్‌ కాలేదని తెలిసి ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో ఉండగా.. ఓ సినిమాలో నటిగా అవకాశం రావడంతో ఎగిరి గంతేశా. కానీ ఆ ప్రాజెక్ట్‌ కొన్నాళ్లకే ఆగిపోయింది. ఆ తర్వాత కూడా నాకు అవకాశాలు వెంట వెంటనే ఏమీ రాలేదు. దాదాపు పాతిక ఆడిషన్లలో తిరస్కరణకు గురయ్యాను. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేదాన్ని’’ అని చెప్పారు.

Updated Date - Aug 13 , 2024 | 05:09 AM