Court: ప్రియదర్శి హీరో.. నాని సమర్పణ.. మూవీ ప్రారంభం

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:27 PM

ప్రియదర్శి హీరోగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కబోతోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సమర్పణలో ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కబోతోంది. వాల్ పోస్టర్ సినిమా (Wall Poster Cinema) కమర్షియల్‌ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన కంటెంట్-డ్రివెన్ మూవీస్ నిర్మించడంలో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌లో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం పొందాయి. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు నాని ప్రజెంటర్‌గా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడీ బ్యానర్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ (COURT State vs A Nobody) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రియదర్శిపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్‌ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ప్రకటిస్తూ విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్‌ సినిమాపై ఇంట్రస్ట్‌ని కలిగిస్తోంది. బోనులో న్యాయదేవత, శాంతి చిహ్నాలు‌గా ఎగురుతున్న పావురాలు వున్న ఈ టైటిల్ లుక్ పోస్టర్ క్యురియాసిటీని పెంచుతోంది. అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుందని.. ఇందులో ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని మేకర్స్ తెలుపుతున్నారు. (COURT State vs A Nobody Movie Launched)


Nani-Court.jpg

ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రామ్ జగదీష్‌తో పాటు కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Court-1.jpg

Read Latest Cinema News

Updated Date - Aug 30 , 2024 | 05:27 PM