Nani-Samantha: ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:45 PM

గౌతమ్ మీనన్ రూపొందించిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూనే ఉన్నాయి. వాటిలో నాని, సమంత కలిసి చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంటూనే ఉంటుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న రీ రిలీజ్ కాబోతోంది.

Yeto Vellipoyindi Manasu Movie Stills

ఆ భాష, ఈ భాష అని లేదు.. ఏ భాష అయినా సరే.. మంచి ప్రేమ కథా చిత్రం వస్తే.. ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో నిరూపితమైంది. కొన్ని ప్రేమ కథా చిత్రాలను ప్రేక్షకులు రిపీట్ మోడ్‌లో చూస్తూనే ఉంటారు. అలాంటి చిత్రాలను రూపొందించడంలో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన రూపొందించిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూనే ఉన్నాయి. వాటిలో నాని (Nani), సమంత (Samantha) కలిసి చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ (Yeto Vellipoyindi Manasu)కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంటూనే ఉంటుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది.

Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు


Nani.jpg

పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్‌పై సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని, స్టార్ హీరోయిన్ సమంతల ఈ క్యూట్ లవ్ స్టోరీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రీ రిలీజ్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గౌతమ్ మీనన్ (Gautam Menon) దర్శకత్వం, ఇళయరాజా (Ilayaraja) సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. (Yeto Vellipoyindi Manasu Re Release Details)

Read Latest Cinema News

Updated Date - Jul 23 , 2024 | 03:45 PM