35 Chinna Katha Kaadu: ‘చిన్నా ఇది వింత లోకం’ సాంగ్ విడుదల

ABN , Publish Date - Aug 22 , 2024 | 09:43 PM

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. తాజాగా ఈ సినిమా నుంచి ‘చిన్నా ఇంది వింత లోకం’ అనే సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

35 Chinna Katha Kaadu Movie Still

నివేత థామస్ (Nivetha Thomas), ప్రియదర్శి (Preyadarshi), విశ్వదేవ్ (Vishwadev), గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ‘35-చిన్న కథ కాదు’ (35- Chinna Katha Kaadu). సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి (Rana Daggubati), సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని (Nanda Kishore Emani) రైటర్, డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చిన్నా ఇంది వింత లోకం’ అనే సాంగ్‌ని (Chinna Idi Vintha Lokam Lyrical Song) మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Gaddar Awards: గద్దర్ అవార్డుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు వీరే..


35-Chinna-Katha-Kadu.jpg

చిల్డ్రన్స్, ఇన్నోసెంట్ హార్ట్స్‌ని బ్యూటీఫుల్‌గా ప్రజెంట్ చేసిన ఈ పాటని సంగీత దర్శకుడు వివేక్ సాగర్ (Music Director Vivek Sagar) సూపర్బ్‌గా కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి (Bharadwaj Gali) రాసిన లిరిక్స్ అందరూ రిలేట్ చేసుకునేలా వున్నాయి. సింగర్ విజయ్ ప్రకాష్ (Vijay Prakash) లైవ్లీగా పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా క్లీన్ ఎంటర్ టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. విజువల్ అప్పీల్‌‌ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ‘35-చిన్న కథ కాదు’ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది. (Chinna Idi Vintha Lokam Lyrical Song From 35 Chinna Katha Kaadu)

Read Latest Cinema News

Updated Date - Aug 22 , 2024 | 09:43 PM