Celebrity Reactions : అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సినీ ప్రముఖుల స్పందన

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:57 AM

అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయడం సరికాదంటూ మొదట బాలీవుడ్‌ నుంచి వరుణ్‌ ధావన్‌ స్పందించారు. ఆ తర్వాతే టాలీవుడ్ సెలబ్రీటీలు ట్వీట్‌ చేశారు.

అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయడం సరికాదంటూ మొదట బాలీవుడ్‌ నుంచి వరుణ్‌ ధావన్‌ స్పందించారు. ఆ తర్వాతే టాలీవుడు సెలబ్రీటీలు ట్వీట్‌ చేశారు.

హృదయ విదారక ఘటన

సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే అత్యుత్సాహం సాధారణ పౌరుల రక్షణలో కూడా చూపించాలని కోరుకుంటున్నా. మనం మంచి సమాజంలో జీవించాలి. ఇదొక దురదృష్టకర ఘటన. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్‌ కాదు.

- నాని

నమ్మలేక పోతున్నా

ప్రస్తుతం జరుగుతున్నది నమ్మలేక పోతున్నా. జరిగిన సంఘటన దురదృష్టకరం, చాలా బాధాకరం. అయితే, తప్పంతా ఒక వ్యక్తిపైకి నెట్టడం సమంజసం కాదు.

- రష్మిక

బాధాకరం

సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన ఘటన బాధాకరం. మరిన్ని జాగ్రతలు తీసుకుని ఉండాల్సింది. ఈ ఘటనకు అల్లు అర్జున్‌ని బాధ్యుడిగా చేయడం దారుణం. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

- అనిల్‌ రావిపూడి

దురదృష్టకరం

థియేటర్‌ వద్ద ఘటన దురదృష్టకరం. ఒక తల్లి ఆ రోజు ప్రాణాలు కోల్పోయింది. కానీ ఈ రోజు అల్లు అర్జున్‌ పట్ల జరిగింది మాత్రం చాలా కఠినమైన చర్య.

- అడవి శేష్‌

అన్యాయం

ఈ ఘటన బాధాకరం. భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే వాళ్లు చుట్టు పక్కల వారికి సూచిస్తుంటారు. ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయం.

- వరుణ్‌ ధావన్‌

జవాబు చెప్పాలి

అల్లు అర్జున్‌ ఏమైనా టెర్రరిస్టా? ఇంట్లోకి దూరి అరెస్ట్‌ చేయడం ఏమిటి? ఈ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి అందరికీ జవాబు చెప్పాలి.

- రవి కిషన్‌

Updated Date - Dec 14 , 2024 | 08:06 AM