Rana Daggubati: నాకు ‘కృష్ణతత్వం’ అంటే ఏంటో నేర్పించింది ఆయనే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 08:23 PM
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఓ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రానా, సందీప్ కిషన్‌లు ట్రైలర్ వదిలారు. అనంతరం వారు ఏమన్నారంటే..
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని రానా దగ్గుబాటి, సందీప్ కిషన్‌లు కలిసి విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం
Also Read-Krish weds Priti: సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న క్రిష్.. పెళ్లి ఫొటోలు వైరల్
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. సాయి మాధవ్ బుర్రా గారు నాకు రుణపడి ఉన్నానని చెప్పారు. కానీ నేనే ఆయనకి రుణపడి ఉన్నాను. నాకు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో ‘కృష్ణతత్వం’ అంటే ఏంటో నేర్పించింది ఆయనే. ఆయనని ఎప్పుడు కలిసిన ‘దేవుడంటే సాయం’ అనే ఒక లైన్ గుర్తు ఉంటుంది. ఆ ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి నాకు వీలైన ఏ సహాయం చేయాలనుకున్న చేస్తాను. అంత మంచి తత్వాన్ని నేర్పించిన సాయి మాధవ్ గారికి థాంక్యూ సో మచ్. ప్రశాంత్ వర్మ అమేజింగ్ రైటర్ అండ్ డైరెక్టర్. మోడ్రన్ జనరేషన్‌కి మైథాలజీ స్టోరీలు చెప్పడంలో మాస్టర్. ఈ కథని ఆయన రాయడం చాలా ఆనందంగా ఉంది. ఇది కృష్ణుడు, కంసుడు నుంచి స్ఫూర్తి పొంది రాసిన సోషల్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ.. ఒకరు అర్జునుడు మరొకడు కృష్ణుడు. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా ఒక స్పెషల్ మూవీ అవుతుంది. మానస మన తెలుగు అమ్మాయి. తెలుగులో మాట్లాడే అమ్మాయిని హీరోయిన్‌గా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకి రావడానికి కారణం అశోక్. మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ.. అశోక్ నాన్నగారైన జయదేవ్ గారి విజన్, ఎక్స్పోజర్.. ఈ రెండుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అశోక్‌కి ఆల్ ద వెరీ బెస్ట్. ‘హీరో’ సినిమాలో తనను చూశాను. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాను. తనలో చాలా గ్రోత్ కనిపించింది. 22 నవంబర్ ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ గురించి అందరూ ఇంత గొప్పగా మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది. ప్రశాంత్ వర్మ దగ్గర ఉన్న కథల్లో ఇది నాకు మోస్ట్ ఎక్సైటింగ్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్‌ని అశోక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తన ఫస్ట్ సినిమా చూశాను. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా జెన్యూన్‌గా కష్టపడుతున్నాడు. ఇందులో హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ యూనిక్‌గా వున్నాయి. బిగ్ స్క్రీన్స్‌పై ఈ సినిమాను చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అర్జున్ జంధ్యాల ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. జయదేవ్ గారు అంటే మాకు ఒక స్ఫూర్తి. ఆయన్ని నేరుగా కలవడం చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణగారి లాంటి మంచి ప్రొడ్యూసర్లకి థియేటర్లో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. మానస తెలుగు అమ్మాయి, మిస్ వరల్డ్. ఇందులో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ వేడుక నేను రావడానికి కారణం శంకర్ గారు. నేను సత్యాని పెట్టుకుని ‘వివాహ భోజనంబు’ అని ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అందరూ వద్దన్నారు. కానీ ఆ సినిమా రెండు రాష్ట్రాల రైట్స్‌ని శంకర్ గారు కొనుక్కున్నారు. తను ఒక ఐడియాని, కథని నమ్మి సినిమా చేసే డిస్ట్రిబ్యూటర్.. అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీకి అవసరం. చాలామందికి పెద్ద దిక్కు రానా. తను ప్రతి సినిమాకు వచ్చి సపోర్ట్ చేస్తారు. టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read- Devaki Nandana Vasudeva: మంచి, చెడుల మధ్య యుద్ధం.. ట్రైలర్ ఎలా ఉందంటే..
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రానా గారు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సందీప్ కిషన్ అన్న థాంక్యూ సో మచ్. ఇక్కడి వరకు రావడానికి కారణం ప్రశాంత్ వర్మ గారు. ఈ క్రెడిట్ అంతా ప్రశాంత్ గారికి వెళుతుంది. ఇంత అద్భుతమైన కథ అందించిన ప్రశాంత్ వర్మ గారికి థాంక్యూ సో మచ్. అర్జున్ గారు తన విజన్‌తో సినిమాని మరో రెండు మెట్లు పైకి తీసుకెళ్లారు. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బాలకృష్ణ గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందంగా అనిపించింది. నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దామని అన్నారు.
హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ.. ఇది ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అశోక్ గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో ఫైట్ సీక్వెన్స్, డాన్స్ సీక్వెన్స్, సాంగ్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నన్ను ఎంతగానో గైడ్ చేసిన డైరెక్టర్‌కి థాంక్యూ సో మచ్. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దామని తెలిపారు.