Allu Aravind: ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఓ ఎమోషన్‌తో బయటకు వస్తారు.. ఆయ్!

ABN , Publish Date - Aug 14 , 2024 | 09:50 PM

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లుగా GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Aay Movie Pre Release Event

నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక (Nayan Sarika)లు హీరో హీరోయిన్లుగా GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆయ్’ (Aay Movie). ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా హాజరై బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. (Aay Movie Pre Release Event)

Also Read- Jr NTR: రెండు వారాలు విరామం అందుకే.. ఆ ఊహాగానాలు ఆపండి

ఈ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆయ్’ సినిమాను ఆగస్ట్ 15న సాయంత్రం రిలీజ్ చేయబోతోన్నాం. మా ఈవెంట్‌కు వచ్చిన నిఖిల్, శ్రీలీలకు థ్యాంక్స్. ఈ కథ విన్నప్పుడు కొడితే పది మంది కింద పడే కథ కాదు కదా? అని అడిగాను. ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరి కష్టం వారు పడాలి అని ఎన్టీఆర్‌గారు అన్నారట. అలా నితిన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నయన్ సారిక ఈ చిత్రంలో చాలా బాగా నటించింది. వినోద్ గారు చాలా ఏళ్ల తరువాత మంచి కారెక్టర్ చేశారు. కసిరాజు, అంకిత్ ఇద్దరూ అద్భుతంగా నటించారు. వీళ్లలో ఇంత మంచి నటులున్నారా? అని అనుకుంటారు. అంజితో నాకు బన్నీ వాస్ కథ చెప్పించాడు. కథ బాగానే చెప్పాడు.. కానీ ఎలా తీస్తాడో అని అనుకున్నా. నాది గ్యారెంటీ అని బన్నీ వాస్ అన్నాడు. కానీ పది కోట్ల గ్యారెంటీ ఎవరు ఇస్తారు? అంజి చాలా అద్భుతంగా తీశాడు. నేను ఈ సినిమాను చూశాను. ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఓ ఎమోషన్‌తో బయటకు వస్తారు అని అన్నారు.


aay-Movie.jpg

‘స్వయంభు’ షూటింగ్ వల్ల బయటకు రాలేకపోతున్నాను. సోషల్ మీడియాలో ఆయ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డు మీదే ఫుడ్ తింటూ నితిన్ గారు ప్రమోట్ చేశారు. ఓ మంచి సినిమా, యంగ్ టీం ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని ఇక్కడకు వచ్చాను. జాతి రత్నాలు, మ్యాడ్, బేబీ మేకర్లు ఇక్కడకు వచ్చారు. చిన్న చిత్రం కూడా వంద కోట్లు కొల్లగొట్టొచ్చని నిరూపించారు. ఆయ్ కూడా ఆ కోవలోనే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని హీరో నిఖిల్ (Hero Nikhil) అంటే.. ‘‘నితిన్ ‘మ్యాడ్’ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆయ్ చిత్రంలో హ్యూమర్ చాలా ఉందని అర్థం అవుతోంది. నాకు ఇలాంటి చిత్రాలే చాలా ఇష్టం. అందుకే అనుదీప్‌తో నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. గోదావరి ప్రాంతం, ఆ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఆగస్ట్ 15న అందరూ అన్ని చిత్రాలను చూడండని కోరారు టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela).

చిత్ర హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ.. మా దర్శకుడు మాతో అద్భుతంగా పని చేయించుకున్నారు. నిర్మాతలు బన్నీ వాస్, విద్యా మేడమ్ మా సినిమాను ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. సెట్‌లో ఉండి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ కథను ఓకే చేశాక.. అల్లు అరవింద్‌గారు నాకు ఫోన్ చేశారు. నాతో చాలా సేపు మాట్లాడారు. డీఓపీ సమీర్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. అజయ్, రామ్ మిర్యాల మంచి పాటలు ఇచ్చారు. భాను మాస్టర్ మంచి స్టెప్పులు కంపోజ్ చేశారు. ఆగస్ట్ 15న మా చిత్రం రాబోతోంది. మంచి సందేశాన్ని ఇచ్చాం. కులాలు, మతాలను మించిందే స్నేహం. దాని గురించి ఇందులో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పామని తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - Aug 14 , 2024 | 09:50 PM