NEST: క్రైమ్ థ్రిల్లర్‌ ‘ఎన్.ఇ.ఎస్.టి.’పై సినీ ప్రముఖుల ప్రశంసలు

ABN , Publish Date - Aug 29 , 2024 | 08:08 PM

యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రదేశాలలో షూట్ చేసిన ఎన్.ఇ.ఎస్.టి. (N.E.S.T.) చిత్రంపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇంగ్లీషులో తీసిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, పులి ధరణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో శరత్ సింగం దర్శకుడిగా పరిచయమయ్యారు.

Celebrities at NEST Premiere Show

యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రదేశాలలో షూట్ చేసిన ఎన్.ఇ.ఎస్.టి. (N.E.S.T.) చిత్రంపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇంగ్లీషులో తీసిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, పులి ధరణి ప్రధాన పాత్రలు పోషించారు.

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

ఈ సినిమాతో శరత్ సింగం దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ మూవీని నటుడు అరవింద్ కృష్ణతో సహా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రీమియర్‌ షోను వేశారు. ప్రీమియర్ షో అనంతరం సినిమాను చూసిన సెలబ్రిటీలు మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.


Nest-Movie.jpg

ఎన్.ఇ.ఎస్.టి. (N.E.S.T.) చిత్రం చూసిన వారు మాట్లాడుతూ.. చాలా బాగుందని, సినిమాలో ఆడియెన్స్ అంతా లీనమై చూసేలా ఉందని అన్నారు. ఆడియెన్స్‌పై ఈ సినిమా కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు. కథ, స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉన్నాయని, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో మూవీని తీసినట్టుగా ఉందని చూసిన వారంతా మెచ్చుకోవడం విశేషం. ఫణి శివరాజు, సుదీప్ తానేటి సారథ్యంలోని సినిమాటోగ్రఫీ, భరద్వాజ్ వెంకట ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.

Also Read- Allu Arjun: అల్లు అర్జున్‌కు ఆహ్వానం.. వెళతాడా?


ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, బద్రి కాలేపల్లి, పులి ధరణి, అను రవికుమార్, సంతోషి దామిడి, ప్రసన్న పొన్నాల, సుదీప్ తానేటి, సత్య చలసాని, వినయ్ రెడ్డి కుంట, అభిషేక్ రెడ్డి ఎల్లు, శ్రీపాల్ రెడ్డి, నితిన్ కృష్ణ పులివర్తి, రవికుమార్ పండరి, రవికుమార్ పండరి, రేణు కాలేపల్లి వంటివారు ఈ చిత్రంలో నటించారు.

Read Latest Cinema News

Updated Date - Aug 29 , 2024 | 08:08 PM