మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా
ABN , Publish Date - Oct 12 , 2024 | 02:10 AM
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌ను కథానాయిక రష్మిక మందన్న పొగడ్తలతో ముంచెత్తారు. శుక్రవారం అలియా నటించిన ‘జిగ్రా’ చిత్రం విడుదలైంది. ప్రత్యేక ప్రదర్శనకు రష్మిక హాజరయ్యారు...
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌ను కథానాయిక రష్మిక మందన్న పొగడ్తలతో ముంచెత్తారు. శుక్రవారం అలియా నటించిన ‘జిగ్రా’ చిత్రం విడుదలైంది. ప్రత్యేక ప్రదర్శనకు రష్మిక హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అలియా కథల ఎంపిక అద్భుతంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక మెచ్చుకున్నారు. ‘అలియా నువ్వు మాకు దొరకడం ఓ వరం. నటిగా నీలోని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలానే మరెన్నో గొప్ప చిత్రాల్లో ప్రేక్షకులను అలరించాలి’ అని ఆకాంక్షించారు.