బర్నింగ్ స్టార్ ‘బంగారు గుడ్డు’ పగిలింది..

ABN , Publish Date - Feb 14 , 2024 | 10:41 PM

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో.. న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ‘పీవీఎస్ గరుడ వేగ’ వంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ మరియు ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

బర్నింగ్ స్టార్ ‘బంగారు గుడ్డు’ పగిలింది..
Bangaru Guddu Movie Still

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో.. న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ‘పీవీఎస్ గరుడ వేగ’ వంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ మరియు ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. భావోద్వేగాలతో కూడిన వినోదంతో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.


Sampoo.jpg

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఒక గుడ్డు పగిలి.. అందులో నుంచి హీరోయిన్ వస్తున్నట్లుగా చూపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాలంటైన్స్ డే రోజున టైటిల్ లుక్‌ని ఎందుకు విడుదల చేశామో సినిమా చూసినప్పుడే ప్రేక్షకులకు తెలుస్తుందని దర్శకుడు గోపీనాథ్ నారాయణమూర్తి అంటున్నారు. సంపూర్ణేష్ బాబు బాబుతో పాటు కామెడీ కాదల్ రోబో శంకర్, సురభి శుక్లా, మొట్టై రాజేందర్, చరణ్‌రాజ్, దువ్వాసి మోహన్, సురేఖా వాణి, లొల్లు సభ మారన్, లొల్లు సభ శేషు, లొల్లు సభా మనోహర్, రాములు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలనాటి హీరోయిన్ కిరణ్.. సంగీత దర్శకుడు షమీర్ టాండన్ ట్యూన్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

Updated Date - Feb 14 , 2024 | 10:41 PM