బ్రదర్.. తప్పకరావాలి!
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:03 AM
కమర్షియల్ తెలుగు సినిమాకు ఒక ఊపుని తెచ్చి, బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు.

ఎన్నోసార్లు బాక్సాఫీసు దగ్గర వీరిరువురి చిత్రాలూ పోటీ పడినప్పటికీ ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, ఒకరి మీద మరొకరు ప్రత్యేక అభిమానం కురిపిస్తూ మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేదం ఈ ఇద్దరి హీరోలలోనూ లేదు.
వృత్తిపరమైన పోటీని సినిమాలకే పరిమితం చే సి నిజజీవితంలో ఎంతో ఎమోషనల్ బాండింగ్ కలిగి ఉంటారు చిరంజీవి, బాలకృష్ణ. గురువారం రాత్రి జరిగిన గీత రచయిత రామజోగయ్యశాస్త్రి ఇంట జరిగిన వివాహ వేడుకలో ఈ అనుబంధం మరోసారి ఆవిష్కృతమైంది.
ఈ వేడుకకు చిరంజీవి, బాలకృష్ణ హాజరయ్యారు. చిరంజీవి ఎదురు పడగానే ‘బ్రదర్.. ఎలా ఉన్నారు?’ అని ఆప్యాయంగా పలకరించారు బాలకృష్ణ. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత సెప్టెంబర్ ఒకటిన జరిగే తన సన్మాన కార్యక్రమానికి తప్పకుండా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. వస్తానని చిరంజీవి చెప్పారు. అలాగే ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమం గురించి కూడా వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందని సమాచారం.