బ్లాక్‌బస్టర్‌ పక్కా

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:07 AM

నాని, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్‌.జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కల్యాణ్‌ దాసరి

నాని, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్‌.జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు, ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నెల 29న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతో కష్టపడింది. ఆ కష్టం తెరపై కనపడుతుంది. వారి కోసం ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి. ఈ సినిమాకు వివేక్‌ రైటింగ్‌, జేక్స్‌ బిజోయ్‌ సంగీతం స్పెషల్‌ అట్రాక్షన్‌. నాకు కోపం వచ్చింది. అలా కోపం వచ్చిందంటే బ్లాక్‌బస్టర్‌ పక్కా’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో ఎస్‌.జే.సూర్య, నాని పోటాపోటీగా నటించారు. వివేక్‌ నుంచి ఇటువంటి కమర్షియల్‌ సినిమా అస్సలు ఊహించలేదు. సినిమాను డైరెక్టర్‌ ఓ రేంజ్‌లో తీశారు’’ అని దిల్‌రాజు అన్నారు. ‘‘ఈ సినిమాకు కథే బలం. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అని చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.

Updated Date - Aug 22 , 2024 | 12:07 AM