Suriya44: సూర్య బర్త్‌డే స్పెషల్‌గా.. ‘సూర్య44’ గ్లింప్స్

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:57 PM

వెర్సటైల్ స్టార్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో చేతులు కలిపారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు.

Suriya in His 44th Film

వెర్సటైల్ స్టార్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌ (Karthik Subbaraj)తో చేతులు కలిపారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక (Jyothika) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు. “Somewhere in the sea…” అనే వర్డ్స్‌తో గ్లింప్స్ ప్రారంభమైయింది. హీరో డెన్ రాయల్ ఎస్టేట్ బయట గ్యాంగ్ మెంబర్స్ అతని రాక కోసం ఎదురుచూస్తుంటారు. “A love, a laughter, a war, awaits for you, the one!”అనే టెక్స్ట్ ఈ గ్లింప్స్‌లో చాలా ఇంట్రస్టింగ్‌గా వుంది. (Birthday Special Glimpse From Suriya44 Released)

Also Read- Konidela vs Allu family: డేమేజ్ జరిగింది, మరి పూడ్చటం అల్లు అరవింద్ వంతు కదా!


Suriya44.jpg

ఫ్రెంచ్ గడ్డంతో, సూర్య రగ్గడ్ అవతార్‌ (Suriya Look in His Suriya44 Film)లో స్టైల్‌గా డెన్ నుంచి బయటకు వచ్చారు. ఒకరిపై గన్ గురిపెట్టి సూర్య, థియేటర్లలో ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రామిస్ చేశారు. సూర్య బాడ్ యాష్‌గా కనిపించారు. గ్యాంగ్‌స్టర్‌గా అతని స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ థ్రిల్లింగ్ రైడ్‌కు హామీ ఇస్తోంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీ‌గా వున్నాయి. మహ్మద్ షఫీక్ అలీ ఈ చిత్రానికి ఎడిటర్. ఈ చిత్రానికి స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్, కార్తికేయ సంతానం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సూర్య సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ టాప్‌లో ట్రెండ్ అవుతూ.. రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 23 , 2024 | 09:57 PM