Bharateeyudu 2: మూడో పార్ట్ ఉన్నా కూడా.. 3గంటల సినిమా
ABN , Publish Date - Jul 10 , 2024 | 11:58 PM
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. (Bharateeyudu 2 Movie)
సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ.. నిడివి విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌లో 180 నిమిషాల 04 సెకన్లు నిడివి అని ఉంది. అంటే 3 గంటల 4 సెకన్ల సినిమా ‘భారతీయుడు 2’. వాస్తవానికి ఈ సినిమా ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుంది. అలాగే ఈ మధ్య మీడియా సమావేశంలో డైరెక్టర్ శంకర్ కూడా ఈ సినిమాకు మూడో పార్ట్ ఉందని, చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్‌గా చెప్పడానికి ఈ పార్ట్ సరిపోదని వెల్లడించారు. అలా ఆయన చెప్పినప్పుడు మూడో పార్ట్ మెయిన్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా నిడివి చూస్తుంటే.. ఇందులో అసలు సిసలైన ఎంటర్‌టైన్‌మెంట్ లభించబోతుందనేది అర్థమవుతోంది. చూద్దాం.. మరి మేకర్స్ ఓపికగా మూడు గంటలపాటు ఎలా కూర్చోబెడతారో.. (Bharateeyudu 2 Censor and Run Time)
ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. శంకర్, కమల్ కాంబినేషన్‌లో 1996లో వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘భారతీయుడు’ (Bharateeyudu) చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకోవడానికే కాకుండా, ఐదవ ఆటకు కూడా తెలంగాణ గవర్నమెంట్ అనుమతులు ఇస్తూ జీవోని జారీ చేసింది.