ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్
ABN , Publish Date - Jul 29 , 2024 | 04:16 AM
తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రస్తుత అధ్యక్షుడు దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఆదివారం ఎన్నికలు జరిపి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి పి.భరత్ భూషణ్...
తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రస్తుత అధ్యక్షుడు దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఆదివారం ఎన్నికలు జరిపి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి పి.భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా కె.అశోక్‌కుమార్ గెలిచారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ‘పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. అందరం కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళతాం. ఈ రోజు గెలిచిన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులు. గెలిచిన వారికి సభ్యులందరి మద్దతు ఉంటుంది’ అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘ఛాంబర్ అంతా ఒక కుటుంబం. పరిశ్రమలోని సమస్యలను ఎలా ఎదుర్కొవాలో అందరం కలసి చర్చిస్తాం. భారతదేశంలోని అన్ని పరిశ్రమలను ఒక తాటి మీదకు తీసుకు వచ్చి ముందుకు వెళతాం’ అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు.