ఫిబ్రవరిలో వస్తున్న భైరవకోన
ABN , Publish Date - Jan 11 , 2024 | 02:45 AM
సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది....

సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకొని గంభీరంగా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. అతీంద్రియ శక్తులకు సంబంధించిన అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇదని మేకర్స్ తెలిపారు. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: ఛోటా కె. ప్రసాద్.