‘మిరపకాయ్’ కంటే మెరుగ్గా
ABN , Publish Date - Jul 29 , 2024 | 04:13 AM
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తయారవుతున్న ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నిర్మాతలు ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం టీజర్...
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తయారవుతున్న ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నిర్మాతలు ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం టీజర్ విడుదల చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రా్‌పలో తెర కెక్కిన ఈ చిత్రంలో ఓ వపర్‌ఫుల్ వ్యక్తిపై రైడ్ చేసే ఇన్‌కమ్ టాక్స్ అధికారిగా రవితేజ నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మీడియాతో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘1980-90ల మధ్య జరిగే కథ ఇది. ల్యాండ్ ఫోన్లు, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ షాను పాటలు.. ఇవన్నీ ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ హాఫ్‌లో నోస్టాలజిక్ మూమెంట్స్‌గా ఉంటాయి. అలాగే అమితాబ్ గారిని బేస్ చేసుకుని కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. నా కెరీర్‌లో చాలా ఫాస్ట్‌గా.. కేవలం 78 రోజుల్లో ఈ సినిమా తీశానంటే కారణం నిర్మాత విశ్వప్రసాద్‌గారు. ఇంతకుముందు మా కాంబినేషన్‌లో వచ్చిన ‘మిరపకాయ్’ కంటే మెరుగ్గా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. ‘ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని విశ్వప్రసాద్ తెలిపారు.