BSS12: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాన్ ఇండియా సినిమా ప్రకటన..

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:02 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ 75వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఈ BSS12 ప్రతిష్టాత్మక చిత్రం. BSS12 హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ఇది.

BSS12 Movie Still

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) 12వ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ 75వ జయంతి (Kodi Ramakrishna 75th Birth Anniversary) సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఈ BSS12 ప్రతిష్టాత్మక చిత్రం. BSS12 హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రానికి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి (Ludheer Byreddy) దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. మూవీ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు

400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి కనిపిస్తున్నారు. గుడిపై సూర్యకిరణాలు పడడంతో పోస్టర్ మొత్తం డివైన్ వైబ్ కనిపిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తుపాకీ పట్టుకుని గుడిని చూస్తున్నారు. ఈ పోస్టర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. (BSS12 Announced)


Bellamkonda.jpg

దర్శకుడు లుధీర్ బైరెడ్డి అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన ఇంట్రస్టింగ్, పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను ఈ సినిమా కోసం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా బుధవారం నుంచి రెండో షెడ్యూల్‌ షూటింగ్‌కు రెడీ అవుతోంది. శివేంద్ర కెమెరామ్యాన్‌గా, లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రానికి శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 23 , 2024 | 05:02 PM