యథార్ధ సంఘటనల ఆధారంగా
ABN , Publish Date - Dec 19 , 2024 | 06:14 AM
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విడుదల 2’ చిత్రం ఈనెల 20న విడుదలవుతోంది. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘విడుదల-1’ చిత్రానికి ఇది కొనసాగింపు....
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విడుదల 2’ చిత్రం ఈనెల 20న విడుదలవుతోంది. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘విడుదల-1’ చిత్రానికి ఇది కొనసాగింపు. నిర్మాత చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘అణచివేతకు గురైన పీడిత వర్గాల నుంచి ఉద్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ఈ ‘విడుదల - 2’. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు వెట్రిమారన్ చెప్పారు. అందుకే తమిళ సినిమా అయినా మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. పెట్టుబడిదారులను ఎదిరించి పీడిత వర్గాలకు ఎలా విముక్తి కలిగించారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రంలో విప్లవ నాయకుడు పెరుమాళ్ పాత్రకు విజయ్ సేతుపతి నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. నక్సలైట్ పాత్రలో ఆయన నటన, భావోద్వేగాలను పండించిన తీరు అద్భుతం.
ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం, పీటర్ హెయిన్స్ రూపొందించిన పోరాట ఘట్టాలు, మంజు వారియర్ నటన సినిమాకు ప్రత్యేకాకర్షణ. మా బేనర్ శ్రీ వేదాక్షర మూవీ్‌సపై నిర్మించిన శ్రీశ్రీ రాజావారు చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘డ్రీమ్‌గర్ల్’ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అని చెప్పారు.