Nandamuri Balakrishna : మరో పవర్‌ఫుల్ పాత్రలో బాలయ్య
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:04 AM
నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే తెలుగు నాట ఉండే సందడే వేరు. ఇప్పుడు ఆయనతో చేతులు కలిపారు దర్శకుడు బాబీ కొల్లి. మాస్‌ని మెప్పించే కథాంశంతో ఆయన రూపొందిస్తున్న చిత్రం

నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే తెలుగు నాట ఉండే సందడే వేరు. ఇప్పుడు ఆయనతో చేతులు కలిపారు దర్శకుడు బాబీ కొల్లి. మాస్‌ని మెప్పించే కథాంశంతో ఆయన రూపొందిస్తున్న చిత్రం గ్లింప్స్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతుంది. ‘జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు’ అంటూ ఓ వపర్‌పుల్ డైలాగ్‌తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేశారు. సైలి్‌షగా ఉంటూ అసలు సిసలు వయలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలు నిర్మించే సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం, విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.