Bachhala Malli: ‘బచ్చల మల్లి’ ఫస్ట్ సింగిల్ ‘మా ఊరి జాతరలో’.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 14 , 2024 | 09:59 PM

హీరో అల్లరి నరేష్ తన అప్‌కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Bachhala Malli Movie Still

హీరో అల్లరి నరేష్ (Allari Naresh) తన అప్‌కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’ (Bachhala Malli)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి హీరో నరేష్ మాస్-అప్పీలింగ్ బర్త్‌డే గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు.

Read Latest Cinema News

‘బచ్చల మల్లి’ ఫస్ట్ సింగిల్ ‘మా ఊరి జాతరలో’ను జూలై 16న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇంటెన్సివ్‌గా ఉంది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటని ఈ పోస్టర్‌ని చూపించారు. ‘సీతారామం’ ఫేం విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఈ మూవీలో నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అల్లరి నరేష్‌ని డైరెక్టర్ సుబ్బు మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆ విషయం రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. (Bachhala Malli First Single Release Update)


Bachchala-Malli.jpg

అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కథ, డైలాగ్స్ సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు. ‘మానాడు, రంగం, మట్టి కుస్తి’ వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

Updated Date - Jul 14 , 2024 | 09:59 PM