Average Student Nani: హీరోయిన్లు నన్ను డామినేట్ చేశారంటోన్న హీరో!
ABN , Publish Date - Aug 01 , 2024 | 12:19 AM
శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఇంతకు ముందు ‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి.. ఈ సినిమాకు దర్శకత్వం చేయడంతో పాటు హీరోగానూ పరిచయం కాబోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.
శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani). ఇంతకు ముందు ‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar Kothuri).. ఈ సినిమాకు దర్శకత్వం చేయడంతో పాటు హీరోగానూ పరిచయం కాబోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. (Average Student Nani Pre Release Event)
Also Read- Raj Tarun: ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు.. లావణ్య వివాదంపై రాజ్ తరుణ్
పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ... రెండేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేశా. తల్లి అంటే ఝాన్సీ, తండ్రి అంటే రాజీవ్ కనకాల గారే అనుకున్నా. లక్కీగా నాకు వాళ్లే దొరికారు. కాలేజ్ అంటే రకరకాల క్యారెక్టర్లు కనిపిస్తాయి. నాని పాత్రలో జెన్యూనిటీ ఉంటుంది. కాలేజ్ కుర్రాడంటే జాలీగా ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ అదే ఛాలెంజింగ్ ఫేజ్. పిల్లలు, తల్లిదండ్రుల పడే బాధ, ఆవేదన ఇలా అన్నీ చూపించాను. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌ను చూపించాను. నేను.. స్నేహ, సాహిబలను డామినేట్ చేద్దామని అనుకుంటే.. వాళ్లే నన్ను డామినేట్ చేసేశారు. దర్శకుడిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. రొమాంటిక్ సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించింది. కార్తీక్ మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. సాజిష్ అద్భుతంగా చూపించారు. ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ఆగస్ట్ 2న రాబోతున్నాం. అందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నానని అన్నారు.
హీరోయిన్ సాహిబ బాసిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. టాలీవుడ్‌లో ఇదే నా మొదటి చిత్రం. నన్ను నమ్మి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్‌కి థాంక్స్. సాజీష్ సర్ మా అందరినీ అందంగా చూపించారు. కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆగస్ట్ 2న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండని పేర్కొనగా.. మరో హీరోయిన్ స్నేహా మాల్వియ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన నా హీరో, డైరెక్టర్, నిర్మాత పవన్‌కి థాంక్స్. సహిబతో పని చేయడం ఆనందంగా ఉంది. మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ, సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్. అందరికీ ఈ మూవీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఆగస్ట్ 2న మా చిత్రం రాబోతోందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి ఝాన్సీ, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి కొడకండ్ల, ఎడిటర్ ఉద్దవ్, కెమెరామెన్ సజీష్ రాజేంద్రన్, సింగర్ అనుదీప్ దేవ్ వంటి వారంతా మాట్లాడుతూ.. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరారు.
Read Latest Cinema News