Average Student Nani: థియేటర్లో చూడాల్సిన చిత్రమిది..

ABN , Publish Date - Aug 02 , 2024 | 01:00 AM

శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఇంతకు ముందు ‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి.. ఈ సినిమాకు దర్శకత్వం చేయడంతో పాటు హీరోగానూ పరిచయం కాబోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరో, హీరోయిన్లు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Average Student Nani Movie Hero and Heroines

శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani). ఇంతకు ముందు ‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar Kothuri).. ఈ సినిమాకు దర్శకత్వం చేయడంతో పాటు హీరోగానూ పరిచయం కాబోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరో, హీరోయిన్లు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Also Read- Raj Tarun: ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు.. లావణ్య వివాదంపై రాజ్ తరుణ్

హీరో పవన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మెరిసే మెరిసే సినిమా తరువాత ఓ కథ రాసుకున్నాను. ఇది స్టూడెంట్ లైఫ్ కథ. కాస్త ఫ్రెష్ ఫేస్ ఉండాలని అనుకున్నా. హీరోయిన్స్ విషయంలో ముందే ఫిక్స్ అయ్యా. హీరో డీగ్లామర్‌గా ఉండాలని అనుకున్నా. అలా చివరకు నేనే హీరోగా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఝాన్సీ గారిని ఒప్పించేందుకు చాలా టైం పట్టింది. క్యారెక్టర్ గురించి ఎన్నో డీటైల్స్ అడిగారు. షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో హీరో, డైరెక్షన్ ఇలా అన్నీ క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తాం. కానీ ఫీచర్ ఫిల్మ్స్ చేసే టైంలో ఇలా అన్ని డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. రొమాంటిక్ సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఇది థియేటర్లో చూడాల్సిన మూవీ. విజిల్స్ వేస్తూ అల్లరి చేస్తూ చూడాల్సిన చిత్రమిది’’ అని అన్నారు. (Average Student Nani Ready To Release)


Pawan-Kumar.jpg

స్నేహా మాల్వియ మాట్లాడుతూ.. ‘‘సారా పాత్ర గురించి విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఇలాంటి లైఫ్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటారు. నా రియల్ లైఫ్ కూడా సారాలానే ఉంటుంది. అందరి దృష్టి తనపైనే ఉండాలనుకునే క్యారెక్టర్. ఎంతో సున్నితమైన మనస్తత్వంతో ఉంటుంది. ఎమోషనల్ పర్సన్. ఇలాంటి పాత్రను చేయాలని అనుకున్నాను. ఇదే నాకు మొదటి చిత్రం. సెట్స్ మీద సాహిబా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. నేను కాస్త అల్లరి చేస్తుంటాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ మూవీలోని పాటల్లో చాలా మూమెంట్స్ చేశాం. పవన్ కుమార్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన మల్టీ టాలెంటెడ్. అన్ని క్రాఫ్ట్‌లను చక్కగా హ్యాండిల్ చేశారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను’’ అని అన్నారు.

సాహిబా బాసిన్ మాట్లాడుతూ.. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన హీరో, దర్శకుడు పవన్‌కి థాంక్స్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఒకే టైంలో అన్ని క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన మా అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఎంతో కంఫర్ట్ ఇచ్చారు. స్నేహా మాల్వియ మంచి ఫ్రెండ్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 02 , 2024 | 01:00 AM